మోడల్ స్కూల్ టేకుర్తి కి చెందిన ఉపాధ్యాయురాలు పద్మజ క్రీడా దుస్తుల పంపిణీ
జమ్మికుంట ఇల్లందకుంట అక్టోబర్ 10 ప్రశ్న ఆయుధం
తెలంగాణ మోడల్ స్కూల్ టీకుర్తి కి చెందిన తెలుగు ఉపాధ్యాయురాలు పద్మజ పాఠశాలలోని 108 మంది విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేసి తమ దాతృత్వం చాటుకున్నారు/ఉపాధ్యాయురాలు పద్మజ 25 వేల రూపాయల తన సొంత ఖర్చుతో పిల్లలందరికీ స్పోర్ట్స్ దుస్తులు అందించారు. మోడల్ స్కూల్ టేకుర్తిలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఇల్లందకుంట
మండల విద్యాధికారి రాములు నాయక్ చేతుల మీదుగా దుస్తుల పంపిణీ జరిగిందని మోడల్ స్కూల్ టేకుర్తి ప్రిన్సిపాల్ డి. ఐలయ్య తెలియజేశారు ఎంఈఓ మాట్లాడుతూ పిల్లలకు తన సొంత ఖర్చుతో దుస్తులు పంపిణీ చేయడం వారి దాతృత్వానికి నిదర్శనమన్నారు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డి. ఐలయ్య ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉపాధ్యాయురాలు పద్మజ ను అభినందించారు.