పద్మాజీవాడి సింగిల్ విండోలో ధాన్యం కొనుగోలు ఆలస్యం

పద్మాజీవాడి సింగిల్ విండోలో ధాన్యం కొనుగోలు ఆలస్యం

అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం

రాత్రిళ్లు మహిళా రైతులకు తీవ్ర ఇబ్బందులు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 22 

సదాశివనగర్, 

పద్మాజీవాడి సింగిల్ విండో పరిధిలో ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 15 రోజులుగా ధాన్యం కంటా చేయకపోవడంతో రైతులు కల్లాల వద్దే పడిగాపులు కాస్తున్నట్లు తెలిపారు. సమస్యను తెలియజేసినా సింగిల్ విండో అధ్యక్షుడు నిర్లక్ష్యంగా స్పందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో మహిళా రైతులు కల్లాల వద్ద కాపలా ఉండటం కన్నా ఇబ్బందికరమై చలి తీవ్రతతో రోగాలు సోకుతున్నాయని చెప్పారు. వెంటనే ధాన్యం కంటా చేసి తరలించే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. స్పందన రాకపోతే రోడ్డెక్కి బైఠాయిస్తామని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment