సంగారెడ్డి/సదాశివపేట, ఆగస్టు 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): సదాశివపేట పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో బుధవారం శ్రావణ మాసం చివరి ముహూర్తం సందర్భంగా గాజుల కృష్ణ, రవి కుమార్ బ్రదర్స్ కలిసి స్వయం ఉపాధి దిశలో భాగంగా జి. కృష్ణ సూటింగ్ అండ్ షర్టింగ్ నూతన వస్త్రాలయాన్ని ప్రారంభించారు. ఇందులో ముఖ్య అతిథులుగా శ్రీ ఈశ్వర మార్కండేయ దేవస్థానం చైర్మన్ చిలువెరి రవి కుమార్, పద్మశాలి పట్టణ సేవా సంఘం అధ్యక్షుడు మునిపల్లి విశ్వనాథం, పట్టణ యువత అధ్యక్షులు న్యాలం ఫణి కృష్ణ, సలహాదారులు మాణిక్యం, నెల్లి కృష్ణ, కూచి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి సోమశంకర్, కోశాధికారి రుమాండ్ల రాజు, పండల జగన్నాథం, పరమాదాసు, బిజ్జ రాజు, ప్రకాష్, మదాసు నరేష్, సంకూరి శివ మొదలగు వారు పాల్గొని గాజుల కృష్ణలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ.. ఇక్కడ వస్త్రాలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయని, రేమాండ్స్, సియారామ్, ఓసియం, లెనిన్ క్లబ్, ఎస్ ఆర్ ఎస్ షూటింగ్స్ మొదలగు వస్త్రాలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
*జి.కృష్ణ నూతన క్లాత్ మర్చంట్ ను ప్రారంభించిన పద్మశాలి యువ నాయకులు*
Published On: August 28, 2024 4:21 pm
