Site icon PRASHNA AYUDHAM

పహల్గాం ఉగ్ర దాడి పాశావీక, అనాగరికమైన చర్య

IMG 20250423 WA2829

*పహల్గాం ఉగ్ర దాడి పాశావీక, అనాగరికమైన చర్య*

*పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్*

*హుజురాబాద్ ఏప్రిల్ 23 ప్రశ్న ఆయుధం*

జమ్ము కాశ్మీర్ లోని పహల్గాంలో అత్యంత క్రూరంగా దాడి చేసి 26 మంది భారత పౌరులను చంపేయడం అత్యంత కిరాతకమైన చర్య అని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత పి డి ఎస్ యూ జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్ అన్నారు సాధారణ పర్యాటకులే లక్ష్యంగా ఆర్మీ యూనిఫాంలో వచ్చి మతం అడిగి మరీ కాల్పులు జరిపి, దొరికిన వాళ్లను దొరికినట్లు పిట్టలను కాల్చినట్టు కాల్చి రక్తశక్తం చేసి మరణహోమం చేసిన మత ఉన్మాదుల చర్యలను పిరికిపంద చర్యగా అభివర్ణిస్తున్నామని

26 మంది ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఉగ్రముఖలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు పాకిస్తాన్ కు చెందిన టెర్రరిస్ట్ గ్రూప్పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టెర్రర్ ఎటాకు యావత్ భారత్ ముక్తకంఠంతో ఖండిస్తోందని మతం ముసుగులో హిందూ మతం అడిగి మరీ చంపడం అత్యంత ఆటవీక చర్య.

ఈ దాడి తీవ్రమైన దిగ్భ్రాంతికరమని ఇది అమానవీయ చర్యఅని క్షమించరానిదని ఉగ్రదాడులకు పాల్పడే వారిపై యావత్ దేశం ఐక్యంగా పోరాడుతుందని జమ్మూ కాశ్మీర్ లో సాధారణ పరిస్థితి కొరకు ప్రభుత్వం కృషి చేయాలని పౌరుల ప్రాణాలకు పగడ్బందీ రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు మతం ముసుగులో భారత్పై దాడులు చేసే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పగడ్బందీ చర్యలు చేపట్టాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత జిల్లా అధ్యక్షుడు కుమార్ తెలిపారు

Exit mobile version