పహల్గామ్ బాధితుడి భార్య ఎమోషనల్ కామెంట్స్..

*ఆపరేషన్ సిందూర్‌ దాడి వ్యక్తిగతం..*

*పహల్గామ్ బాధితుడి భార్య ఎమోషనల్ కామెంట్స్..*

పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సాయుధ దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించారు. ఈ దాడిలో 9 స్థావరాలు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. అంతేకాకుండా దాదాపు 100 మంది మరణించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సందర్భంగా ఉగ్రదాడిలో చనిపోయిన బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభ్వుతానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాయి.

భారత ప్రతీకార చర్యపై ఉగ్రదాడిలో మరణించిన వ్యాపారవేత్త శుభమ్ ద్వివేది భార్య ఐషాన్య స్పందించారు. తన భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకున్నందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమ నమ్మకాన్ని నిలబెట్టారని, ఇదే నా భర్తకు అసలైన నివాళి అని భార్య ఐషాన్య వ్యాఖ్యానించారు. నా భర్త ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుందని ఆమె పేర్కొన్నారు.

పహల్గామ్‌ ఉగ్రదాడిని వ్యక్తిగతంగా తీసుకుని PM మోదీ, దళాలు ఆపరేషన్ సిందూర్ పేరుతో ప్రతీకారం తీర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నాలాంటి చాలా మంది మహిళలు తమ సిందూర్‌ను కోల్పోయారని, అలాంటి వారందిరికీ మోదీ ప్రభుత్వం భరోసా కల్పించిందన్నారు. అమాయకుల మరణాలకు భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటుందని తాను ఎప్పుడూ నమ్ముతానని ఆమె పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now