మండల వ్యాప్తంగా జడ్పిటిసి పైడి సేవలు అమోఘం.. జడ్పీ చైర్మన్ చంద్రశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు సేవలు దమ్మపేట మండలంలో అమోఘమని జడ్పీ చైర్మన్ చంద్రశేఖర్ అన్నారు. కొత్తగూడెంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లావ్యాప్తంగా ఉన్నా జడ్పీటీసీలకు చివరి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావుకు సన్మానం చేసి దమ్మపేట మండలం వ్యాప్తంగా వారు చేసిన సేవలను జడ్పీ చైర్మన్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు సేవలు అమోఘమని, మండల వ్యాప్తంగా ప్రతి వ్యక్తితో సత్సబంధాలు కలిగిన వ్యక్తి జెడ్పిటిసి పైడి అనీ, మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఆయన చేసిన అభివృద్ధిని ఆయన గుర్తు చేశారు.. జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు కేవలం ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా కుటుంబ సభ్యుడిగా ప్రతి ఒక్కరికి జెడ్పిటిసిగా సేవలందించారని గుర్తు చేశారు… జిల్లావ్యాప్తంగా ఉత్తమ జడ్పిటిసిలో పైడి వెంకటేశ్వరరావు ఒకరని, కల్మషం లేని వారిని, ప్రతి వ్యక్తికి ప్రతి గ్రామానికి సేవ చేసిన వారిని అన్నారు. ఆయన తన జడ్పిటిసి పదవీకాలంలో చివరి సర్వసభ్య సమావేశంలో పాల్గొనడం బాధాకర విషయం అయినాసరే .. జడ్పిటిసి పదవికి తగిన న్యాయం చేశారని తెలిపారు