స్వచ్ఛత హి సేవలో భాగంగా చిత్రలేఖనం

స్వచ్ఛత హి సేవలో భాగంగా చిత్రలేఖనం

 

కామారెడ్డి జిల్లా తాడ్వాయి

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 19

 

 

స్వచ్ఛత హి సేవ–2025 కార్యక్రమాల లో భాగంగా శనివారం కన్కల్ గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పరిశుభ్రత ప్రాముఖ్యతను గ్రామస్థులకు చాటి చెప్పేందుకు స్థానిక స్కూల్ విద్యార్థులు చిత్రలేఖన పోటీలలో పాల్గొన్నారు.

 

స్కూలు పిల్లలు వేసిన బొమ్మల ద్వారా శుభ్రతే ఆరోగ్యం – పరిశుభ్రతే ప్రగతి, అనే సందేశాన్ని స్పష్టంగా చూపించారు. గ్రామస్తులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ స్వచ్ఛత మన కుటుంబం నుండి ప్రారంభమై సమాజం వరకు వ్యాప్తి చెందాలని పేర్కొన్నారు.

 

గ్రామ పెద్దలు మాట్లాడుతూ పిల్లలు వేసిన చిత్రాలు ప్రతి ఒక్కరిని పరిశుభ్రతపై చైతన్యవంతులను చేస్తాయని అభినందించారు. ఇటీ కార్యక్రమంలో ఏఎన్ఎం,లక్ష్మి, ఎం ఎల్ హెచ్ పి, రాకేష్, మరియు సెక్రటరీ విక్రాంత్ సింగ్, కారోబార్, వంశీ, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, జిపిఓ

మినేష్, ఆశ వర్కర్స్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now