స్వచ్ఛతపై చిత్రలేఖన పోటీ
బహుమతులు పంపిణీ చేసిన పంచాయతీ కార్యదర్శి రాగుల రాంబాబు
చేర్యాల సెప్టెంబర్ 20 ప్రశ్న ఆయుధం :
17 సెప్టెంబర్ 02 అక్టోబర్ జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛత ఉత్సవాల్లో భాగంగా శనివారం ఎంపీపీఎస్ శభాష్ గూడెం లో విద్యార్థులకు గ్రామ పంచాయతీ కార్యదర్శి రాగుల రాంబాబు సౌజన్యంలో స్వచ్ఛతపై చిత్రలేఖన అనే అంశంపై పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి రాగుల రాంబాబు, ప్రధానోపాధ్యాయులు మరాఠి సంతోష్ స్వచ్ఛ పాఠశాల స్వచ్ఛ పాఠశాల గా తీర్చిదిద్ది స్వచ్ఛ శభాష్ గూడెం గ్రామ పంచాయతీ గా రూపొందించుట కు మా వంతు సహకారం ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా గ్రామంలోని ప్రతి పౌరుడు స్వచ్ఛ గ్రామంగా తయారు చేయుటకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ యొక్క కార్యక్రమంలో ఉపాధ్యాయులు పత్తిపాక మోహన్ బాబు,సోమారపు రేణుక,బండకింది స్వప్న పాల్గొన్నారు.