పాకిస్తాన్ వాసులను భారతదేశం నుండి బహిష్కరించాలి

*పాకిస్తాన్ వాసులను భారతదేశం నుండి బహిష్కరించాలి*

*తాసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు*

*జమ్మికుంట మే 6 ప్రశ్న ఆయుధం*

భారతదేశానికి విజిటింగ్ వీసా పైన ఆరోగ్య వీసా పైన వచ్చిన పాకిస్తాన్ వాసులను అక్రమంగా చొరబడ్డ పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాసులను భారతదేశం నుండి బహిష్కరించాలని బిజెపి పార్టీ జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కోలకాని రాజు ఆధ్వర్యంలో బిజెపి నాయకులు మంగళవారం జమ్మికుంట తహసిల్దార్ రాజుకు వినతిపత్రం అందజేశారు అనంతరం బిజెపి నాయకులు కొలకాని రాజు, ఆకుల రాజేందర్ మాట్లాడుతూ కాశ్మీర్ పాహల్గామ్ లో ఏప్రిల్ 22 రోజున పాకిస్థాన్ ఐఎస్ఐ శిక్షణ పొందిన మతోన్మాద ఉగ్రవాదులు భారతీయులపై అందులో హిందువుల పై కాల్పులు జరిపి 26 మంది అమాయకులను చంపిన దుశ్చర్యకు యావత్ భారత దేశం ముక్తకంఠంతో ఖండించిందని, ప్రపంచ దేశాలు కూడా ఈ అఘాయిత్యాన్ని ఖండించాయని ఇలాగే పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే భారత్ యుద్ధం ప్రకటిస్తే అమెరికా , జపాన్, ఇజ్రాయెల్ మెజారిటీ దేశాలు పాకిస్థాన్ నీ ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని బహిరంగంగా మద్దతు ప్రకటించాయని తెలిపారు.కానీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పాకిస్తాన్ దేశవాసులను గుర్తించడంలో మీనమేషాలు లెక్కించడం శోచనీయం అని పేర్కొన్నారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పాకిస్తాన్ వాసులను అన్ని జిల్లాల్లో వెతికించి దేశం నుంచి తరిమి కొట్టాలని అన్ని రాష్ట్రాలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర హోంశాఖ ఏప్రిల్ 25న ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకుని పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఇతర దేశాల జాతీయులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారిని వారి దేశాలకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, కైలాసకొటి గణేష్, రాజేష్ ఠాకూర్, గండ్ల సంపత్, మోతె స్వామి, ఎదులాపురం అశోక్, ఇటుకాల స్వరూప, బచ్చు శివన్న, పల్లపు రవి, మోడం రాజు, రాకేష్ ఠాకూర్, రాము, కనుమల్ల లక్ష్మి, కేస స్వరూప, పొనగంటి రవి, ఉడుగుల మహేందర్, గంగాభవాని, కొండ్ర సులోచన, అప్పాల రవిందర్, ముకుందా సుధాకర్, కొండపర్తి ప్రవీణ్, రాచపల్లి ప్రశాంత్, శ్రీవర్తి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now