*పాక్కు గూఢచర్యం.. వ్యాపారి అరెస్టు*
పాక్కు గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలతో మరొకరు అరెస్టయ్యారు. UP రాంపూర్కు చెందిన వ్యాపారి షహాద్ను STF పోలీసులు అరెస్టు చేశారు. క్రాస్ బోర్డర్ స్మగ్లింగ్తో పాటు దేశ భద్రతా పరమైన అంశాలను పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్సు చేరవేస్తున్నాడని, ISI ఏజెంట్లకు డబ్బు, దుస్తులు, ఇండియన్ సిమ్ కార్డులు కూడా అందజేశాడని STF పోలీసులు ఆరోపించారు. UP నుంచి కొందరిని ISI కోసం పనిచేసేందుకు పంపాడని తెలిపారు.