మందకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం

*మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 2*

జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో శుక్రవారం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఎమ్మార్పీఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాలు చిరస్మరణీయం అని ఎమ్మార్పీఎస్ జమ్మికుంట మండల మాజీ అధ్యక్షుడు దొగ్గల భాస్కర్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలుబడిన తర్వాత శుక్రవారం వెంకటేశ్వరపల్లి గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ కు పూలమాలవేసి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలుగా చేసిన పోరాటం వృధా కాలేదని భారత అత్యున్నత న్యాయస్థానం మా పోరాటాన్ని గుర్తించి వారికి న్యాయం చేయాలనే సంకల్పంతో ఎస్సీ వర్గీకరణ పై సంచలనాత్మక తీర్పును ప్రకటించడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జమ్మికుంట మండల మాజీ అధ్యక్షులు దొగ్గల భాస్కర్ అంకుష్ రెంటాల మహేందర్, సిరిపల్లి సమ్మయ్య, బండారి శంకర్ ,పుల్లూరు రాజేష్ ,మచ్చ మొగిలి ,పుల్లూరు రామచంద్రం ,కొమ్ము శీను, అల్లకొండ బాబు, కొమ్ము పోచయ్య, పుల్లూరు ,దుర్గయ్య పుల్లూరు నర్సయ్య, దొగ్గల పూలమ్మ పుల్లూరు చిలుకమ్మ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now