Site icon PRASHNA AYUDHAM

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

*సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం*

 గాంధారి మండల ఏఎంసి మండల కమిటీ

ప్రశ్న ఆయుధం న్యూస్ 30 నవంబర్ కామారెడ్డి జిల్లా 

గాంధారి మండల కేంద్రంలోని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రైతు పండుగ వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి, చిత్రపటానికి పాలాభిషేకం చేసి పలువురు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ బండారి పరమేశ్వర్, మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి సన్న రకానికి 500 బోనస్ ఇస్తామని వడ్లు కొనుగోలు చేసిన ఒక్కరోజులోనే డబ్బులు రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నందుకు గౌరవ ఎమ్మెల్యే మదన్మోహన్ సహకారంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశిస్తున్నారని తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుంది అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏఎంసీ కమిటీ మెంబర్స్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Exit mobile version