మెదక్/రామాయంపేట, సెప్టెంబరు 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ అనుమతి ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనoపల్లి రోహిత్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. బుధవారం రామయంపేట చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనoపల్లి రోహిత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మెదక్ ఎమ్మెల్యే డైనమిక్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ఢిల్లీలోని కేంద్ర మెడికల్ బోర్డుతో చర్చించి మెదక్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ అనుమతికి గ్రీన్ సిగ్నల్ వచ్చేలా కృషి చేశారని తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే డైనమిక్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ చౌదరి సుప్రభాత్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నాగులు, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్, ఫిషర్మెన్ కార్యదర్శి దండు శివశంకర్, ఎన్ఎస్ఎస్ఓ నాగుల్ శ్రీధర్ రెడ్డి, నాయకులు శంకరయ్య, బైరన్ కుమార్, బొట్ల బాబు, హనుమంతరావు, రవి, చింతల స్వామితో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.