ఘనంగా పల్గుణ శుద్ధి చతుర్థి సంత చతుర్థి ప్రతి

ఘనంగా పల్గుణ శుద్ధి చతుర్థి సంత చతుర్థి ప్రతి

IMG 20250303 WA0010

జిల్లా కేంద్రంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీ లో గల శ్రీ సంకష్టహర మహాగణపతి క్షేత్రంలో సోమవారం వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు యజ్ఞం సంపత్ కుమార్ శర్మ, రమాకాంత్ శర్మ, పవన్ శర్మ, వంశి శర్మ, అరవింద్ , భరద్వాజ్, సతీష్ పాండే, సందీప్ పాండే, రమేష్ జోష్, సేనాపతి, సంజీవరావు ఆధ్వర్యంలో పల్గుణ శుద్ధి చతుర్థి సంత చతుర్థినీ ఘనంగా నిర్వహించారు.ప్రతి సంవత్సరం ఇదే రోజున ఈ పుత్ర కామేష్టి సత్యసంతాన పూజ గత 15 సంవత్సరాలుగా ఆన వాయితిగా వస్తుందని, ఈ వ్రతం వల్ల చాలామంది దంపతులు సంతానాన్ని పొందుతున్నట్లుగా విశేష ప్రాచుర్యం ఉందని. సోమవారం రోజు కూడా 121 మంది దంపతులచే పుత్ర కామేష్టి వ్రతంలో పాల్గొనడం జరిగిందని వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సుతారి అంజయ్య, ప్రధాన కార్యదర్శి బొంబోతుల రవీందర్ గౌడ్, కోశాధికారి విశ్వంగుప్త కార్యవర్గ సభ్యులు మరియు భవాని గ్రహ మండలేశ్వర సేవా కమిటీ బృందం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now