పాల్వంచ మున్సిపాలిటీలో ప్రజాసమస్యల పరిష్కారానికై సత్వరమే స్పందించాలి

IMG 20240809 WA2966

-రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంస్చై ర్మన్ కొత్వాల

పాల్వంచ మున్సిపాలిటీలో అపరిష్కృతంగా వున్నా ప్రజాసమస్యలపై కమీషనర్, మున్సిపల్ అధికారులు సత్వరమే స్పందించాలని డీసీఎంస్చై ర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.

ఇటీవల పాల్వంచ మున్సిపాలిటీలో నూతనంగా నియమితులైన కమీషనర్ డాకూ నాయక్ ను, డివిజనల్ ఇంజనీర్ స్వరూపరాణి ను కొత్వాల తోపాటు కాంగ్రెస్ నాయకులు కలిసి, వారికి శాలువా, బొకేలతో సత్కరించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులతో కొత్వాల మాట్లాడుతూ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్యం లోపించి, ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదంఉందని, అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలన్నారు. మిషన్ భగీరథ పైప్లైన్ నిర్మాణాలు అసంపూర్తిగా వుండటం వలన ప్రజలకు త్రాగునీటి సమస్య తీవ్రంగా వుందన్నారు. మున్సిపాలిటీలో స్పెషల్ డ్రైవ్ పెట్టి డ్రైన్లు శుభ్ర పరచడం, బ్లీచింగ్ చలించడం చేపట్టాలన్నారు. అసంపూర్ణంగా వున్నా రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జాలే జానకిరెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, అడ్వకేట్ తుమ్మల శివారెడ్డి, కాంగ్రెస్ నాయకులు చింతా నాగరాజు, బాలినేని నాగేశ్వరరావు, కాపర్తి వెంకటాచారి, గంగిరెడ్డి సుందర్ రెడ్డి, యర్రంశెట్టి మధు, కందుకూరి రాము, పులి సత్యనారాయణ, పైడిపల్లి మహేష్, దారా చిరంజీవి,  చాంద్ పాషా, కాపా శ్రీను, వుండేటి శాంతివర్ధన్, గండు భారత్, బాదర్ల జోషి, పాబోలు నాగేశ్వరరావు,  బాషా, అజిత్, ఆవుల మధు, నాగారం ప్రసాద్, పుప్పాల నాగేశ్వరరావు, బలగం కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now