పాఠశాలలో వాటర్ ప్యూరిఫైయర్ను ఏర్పాటుచేసిన పాన్ సీడ్ ఫౌండేషన్

*పాఠశాలలో వాటర్ ప్యూరిఫైయర్ను ఏర్పాటుచేసిన పాన్ సీడ్ ఫౌండేషన్*

*ఇల్లందకుంట జనవరి 10 ప్రశ్న ఆయుధం*

IMG 20250110 WA0136

జిల్లా ఇల్లందకుంట మండలంలోని చిన్న కోమటిపల్లి గ్రామంలో పాన్ సీడ్ ఫౌండేషన్ వారి సహకారంతో పాఠశాలలోని వాటర్ ప్యూరిఫైయర్ని సీడ్ ఆర్గనైజర్ చుక్క వేణుగోపాల్ ఏర్పాటు చేసారు.

IMG 20250110 WA0140 మండలం చిన్న కోమటిపల్లి గ్రామంలో పాన్ సీడ్ ఫౌండేషన్ వారి పాఠశాలలోని 1 లక్ష 50 వేల రూపాయలు విలువచేసే వాటర్ ప్యూరిఫైయర్ని సీడ్ ఆర్గనైజర్ చుక్క వేణుగోపాల్ ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి రాములు పాన్ సీడ్ ఫౌండేషన్ వరంగల్ ఇన్చార్జ్ హేమంత్ కుమార్ కరీంనగర్ ఇన్చార్జ్ తరుణ్ రెడ్డిలు హాజరై వారు మాట్లాడుతూ పాన్ సీడ్ కంపెనీ ప్రారంభించి 50 సంవత్సరాల పురస్కరించుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతుందని గత పది సంవత్సరాలుగా చిన్న కోమటిపల్లి గ్రామంలో రైతులందరూ పాన్ సీడ్ ఆదరిస్తు కంపెనీకి లాభం చేకూరుస్తున్నారని వచ్చిన లాభంలో సగం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు గతంలో కంపెనీ ప్రతినిధులు ఈ గ్రామానికి వచ్చినప్పుడు గ్రామ సీడ్ ఆర్గనైజర్ చుక్క వేణుగోపాల్ మా గ్రామానికి కంపెనీ తరఫున ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలని గ్రామంలోని పాఠశాలల్లో విద్యార్థులు త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని కంపెనీ ప్రతినిధులకు తెలుపగా వెంటనే సానుకూలంగా స్పందించిన కంపెనీ ప్రతినిధులు వాటర్ ప్యూరిఫై ఏర్పాటు చేస్తామని చెప్పి నేడు పాఠశాలలో 1,50,000 వాటర్ ప్యూరిఫైయర్ని ప్రారంభించడం సంతోషకరమని అన్నారు గ్రామానికి గుడి బడి ఎంత ముఖ్యమో బడిలో చదువుకునే పిల్లల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని చిన్న కోమటిపల్లి నాకు జన్మనిచ్చిన గ్రామం కనుక నా వంతు సహకారాలు ఉంటాయని చుక్క వేణుగోపాల్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సీడ్ ఆర్గనైజర్ చుక్కా వేణుగోపాల్ సీడ్ ఫౌండేషన్ వరంగల్ ఇన్చార్జ్ హేమంత్ కుమార్ ,కరీంనగర్ ఇన్చార్జ్ తరుణ్ రెడ్డి, ఎంఈఓ రాములు, తాజా మాజీ సర్పంచ్ చిట్ల సరోజన నాగన్న, ఉప సర్పంచ్ చుక్క రవి, చర్లపల్లి రాజు, లాదెళ్ల తిరుపతి చుక్క తిరుపతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్ తో పాటు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment