Headlines
-
విద్యను రాజకీయాలకు ముడి పెట్టకుండా పంచాయతీ ఆధారిత పరిష్కారాలు
-
PAAP: విద్యా సంస్థల పనితీరును పర్యవేక్షించడంలో పంచాయతీ పాత్ర
-
పంచాయతీ విద్యా ఉపకమిటీ: గ్రామ పంచాయితీలతో విద్యా వ్యవస్థను బలోపేతం చేయండి
-
విద్యయేతనకు రాజకీయాలు ఎందుకు హానికరంగా? PAAP పిలుపు
-
PAAP ద్వారా పాఠశాల నిర్వహణకు పంచాయతీ ఆధారిత పద్ధతులు
*ఈసురోమని వ్యవస్థలు ఉంటే…*
*విద్యయేగతిన బాగుపడునోయ్…* *PAAP*
*తల్లిదండ్రులారా ప్రశ్నించండి…*
విద్య ను రాజకీయాలకు… ముడి పెట్టద్దు…??
పంచాయితీ, మున్సిపాలిటీ నగర సంస్థ లు అనేది రాజకీయాలకతీతం…
తమ బాధ్యత ను తాము నిర్వహించినప్పుడు..
అప్పుడే ప్రభుత్వ బడులు బ్రతుకుతాయి….
నిరుపేద మధ్యతరగతి పిల్లలకు విద్య అందుతుంది
73వ రాజ్యాంగ సవరణ
73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పాఠశాల విద్యాశాఖలో ఉన్న అన్ని పాఠశాలలకు చెందిన అంశములకు సంబంధించిన అధికారాలు, బాధ్యతలను పంచాయితీ సంస్థలకు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 2 తేది 03.02.2008 ద్వారా బదలాయింపు జరిగింది.
పంచాయితీరాజ్ సంస్థలను పునరుజ్జీవం మరియు బలోపేతం చేయడానికై ఈ చట్టం నిర్దేశింపబడింది. ఈ సవరణ పంచాయితీరాజ్ సంస్థలకు అధికారాలను, బాధ్యతలను బదలాయించే అవకాశం కల్పించింది. మరియు పంచాయితీలు సామాజిక న్యాయం, ఆర్థికాభివృద్ధి కొరకు, ప్రణాళికల రచనల కొరకు ఉద్దేశించిన పథకాలు అమలులో స్వయం పరిపాలనా సంస్థ పనిచేయగలదు.
రాజ్యాంగం అమలులోని స్పూర్తిని ప్రతిబింబించే విధంగా ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ చట్టం 1994 చేయబడింది.
భారత ప్రభుత్వం పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ, పంచాయితీరాజ్ సంస్థలకు అధికార బదిలీలు చేసే సవివరమైన ప్రణాళిక చేయుటకు 7వ రౌండు టేబుల్ సమావేశం చేసింది.
ఈ చట్ట సవరణ ఆధారంగా ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలో పంచాయితీ విద్యా ఉపకమిటీని ఏర్పాటు చేయాలి.
@ పంచాయితీ విద్యా ఉపకమిటీ ఏర్పాటు…
ప్రతి గ్రామ పంచాయితీని పంచాయితీ విద్యా ఉపకమిటీని గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో మహిళ వార్డు సభ్యులతో ఒకరు వైస్ చైర్మెన్ గాను, మరొకరు సభ్యులుగాను మరియు షెడ్యుల్డ్ కులాలు / తెగలు లేదా వెనుకబడిన తరగతులకు సంబంధించిన ఇద్దరు వార్డు సభ్యులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
@ ఉపకమిటీ విధులు :
1.గ్రామ పంచాయితీ పరిధిలోని అన్ని పాఠశాలల పనితీరు
పాఠశాల సిబ్బంది రోజు వారి హాజరు
2.పిల్లల విద్యా ప్రమాణాలు
3.పాఠశాల మౌళిక సహాయాలు
4.మధ్యాహ్న భోజన పథకం సక్రమ అమలు మొదలగు వాటిని నియంత్రించే అధికారం ఉంటుంది.
@ సమావేశాల నిర్వహణ..
1.ఉపకమిటీ ప్రతి శనివారం, ఒకవేళ శనివారం సెలవుదినమైతే ఆ ముందు రోజు సమావేశం జరుగుతుంది. సమావేశానికి గ్రామ పంచాయితీ పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఇద్దరు లేదా ముగ్గురు సీనియర్ ఉపాధ్యాయులు పాల్గొంటారు.
@ చర్చా అంశాలు:
1.ఉపాధ్యాయుల హాజరు
2.పిల్లల నమోదు మరియు గైర్హాజరు
3.మధ్యలో బడిమానిన పిల్లల వివరాలు మరియు కారణాలు
4.పాఠశాలకు అవసరమగు స్వల్ప మరమ్మత్తులు
పై అంశాలకు సంబంధించిన గ్రామ పంచాయితీలు మీకు సహాయపడతాయి.
అలాగే ఈ దిగువ తెలిపిన విషయాలు కూడా తనిఖీ చేస్తే అథారిటీని కలిగి ఉంటుంది.
5.ఉపాధ్యాయులు బడి వేళలు పాటించేలా చూడటం
6.పాఠశాలలో అమలవుతున్న కార్యక్రమాల తీరును పర్యవేక్షించడం.
7.మధ్యాహ్న భోజనం నాణ్యతను తెలుసుకోవడం.
8.పాఠ్యపుస్తకాల సరఫరాలను పరిశీలించడం.
9.పాఠశాల ఫర్నీచర్, లైబ్రరీ పుస్తకాలు, ప్రయోగశాలలు ఎక్విప్ మెంట్ సరిగా ఉన్నదీ లేనిదీ సరిచూసి నివేదికలను ఉన్నతాధాకారుల దృష్టికి తీసుకెళ్ళడం.
10.ఉన్నత పాఠశాలలైతే అందులో చదువు 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించే ప్రత్యేక తరగతుల నిర్వహణకు అవసరమైన లైటింగ్, అల్పాహారం ఇతర ఏర్పాట్లను మునిసిపల్.. కార్పొరేషన్…గ్రామ పంచాయితీలు సహకారంతో అందించడం.
*ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్*
*(రిజిస్టర్ నెంబర్ 6/2022)*
*ఆంధ్ర ప్రదేశ్ కమిటీ.*
*_For more information please join with PAAP_*
https://chat.whatsapp.com/K27AgSLzAXEDNbmfZY5pUQ