Site icon PRASHNA AYUDHAM

ఆర్ టి ఐ దరఖాస్తు దారుడిని పంచాయతీ కార్యదర్శి దురుసుగా ప్రవర్తన

IMG 20250628 WA0087

*ఆర్ టి ఐ దరఖాస్తు దారుడిని పంచాయతీ కార్యదర్శి దురుసుగా ప్రవర్తన*

*ఆర్.టి.ఐ దరఖాస్తుదారుడు జువ్వాజీ అనిల్*

*జమ్మికుంట ఇల్లందకుంట జూన్ 28 ప్రశ్న ఆయుధం*

సమాచారం హక్కు చట్టం ద్వారా జీపీ వివరాలు అడిగిన ఆర్.టి.ఐ దరఖాస్తు దారుడితో పంచాయతీ కార్యదర్శి దురుసుగా ప్రవర్తించిన ఘటన మండల కేంద్రం లో చోటు చేసుకొంది వివరాల్లోకి వెళ్తే శుక్రవారం మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన జె. అనిల్ ఇల్లందకుంట జీపీ కి చెందిన అభివృద్ధి నిధుల వివరాలతో కూడిన సమాచారం కోసం ఇల్లందకుంట పంచాయతీ కార్యదర్శి కి ఆర్.టి.ఐ ద్వారా దరఖాస్తు అందించాడు. కార్యదర్శి ని రిసీవ్డ్ కాపీ అడగగా నేను బిజీ గా ఉన్న నీకు ఇవ్వవలసిన అవసరం లేదు ఇచ్చావు కదా వెళ్ళు అంటూ దురుసుగా ప్రవర్తించాడని అనిల్ పేర్కొన్నాడు ఇదే విషయం పై అనిల్ మాట్లాడుతూ, సామాన్య పౌరునిగా ఆర్టీఐ ద్వారా దరఖాస్తు ఇచ్చినప్పుడు సమాచార అధికారి అదే సమయంలో రిసీవ్ కాపీ ఇవ్వాలని తెలిపారు,ఇవ్వని పంచాయితీ కార్యదర్శి పై శాఖాపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ విషయ పై జిల్లా పంచాయతీ అధికారి కి, జిల్లా కలెక్టర్ కి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కి, పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు

Exit mobile version