Headlines
-
పాండురంగ ఆశ్రమంలో MLA బీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులతో పూజలు
-
రుక్మిణీ శ్రీకృష్ణ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
-
పాండురంగ ఆలయ విశిష్టతను తెలుసుకున్న బీర్ల ఐలయ్య
-
యాదగిరి-గజ్వేల్ బస్సు సౌకర్యంపై వినతి పత్రం అందజేత
-
ఆషాఢ ఉత్సవాల ప్రత్యేకతపై ఆసక్తి చూపిన MLA
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం భవనందాపూర్ గ్రామ శివారులో ఎంతో ప్రసిద్ధి పొందినటువంటి పాండురంగ ఆశ్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆశ్రమంలోని అన్నప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో స్వీకరించారు.పాండురంగ ఆశ్రమంలోని రుక్మిణి శ్రీ కృష్ణ భగవాన్ స్వామివారిని దర్శించుకుని,ఆలయంలో నిర్వహించిన కళ్యాణంలో పాల్గొన్నారు.కల్యాణ ముహూర్తులకు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అనిత దంపతులు పట్టు వస్త్రాలు,బియ్యం సమర్పించారు.అనంతరం ఆశ్రమంలో తొలి ఏకాదశిలో జరిగే ఆషాడ ఉత్సవాల గురించి,ఆలయ విశిష్ట చరిత్రను పురోహితులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆశ్రమ నిర్వాహక పురోహితులు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు యాదగిరిగుట్ట నుండి ఆశ్రమం,వర్గల్ సరస్వతి మాత దేవాలయం నుండి గజ్వేల్ వరకు బస్సు సౌకర్యం కల్పించవలసిందిగా కోరుతూ వినతి పత్రం అందజేశారు.ఆశ్రమం నిర్వాహకులు బీర్ల ఐలయ్య దంపతులను ఘనంగా సత్కరించారు.