*ఎర్ర పహాడ్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు*
ప్రశ్న ఆయుధం 18ఆగష్టు కామారెడ్డి :
తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి గోల్కొండ కోట ను ఏలిన మహావీరుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ నాయకులు అశోక్ గౌడ్, శివ గౌడ్, నందగౌడ్, లక్ష్మీనారాయణగౌడ్, కిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.