పాపన్న జయంతికి ఆగస్టు 18న ప్రభుత్వ సెలవు కావాలి
ఆగస్టు 18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా రాష్ట్ర సెలవు ప్రకటించాలని విజ్ఞప్తి
బహుజన చక్రవర్తి విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలన్న డిమాండ్
పాపన్న గౌడ్ పోరాట గాథను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని సూచన
బహుజనుల కోసం పోరాడిన ధీరుడి త్యాగాలను కొత్తతరం గుర్తుంచుకోవాలని పిలుపు
కామారెడ్డిలో జై గౌడ్ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోల మురళి గౌడ్ ప్రకటన
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్..(ప్రశ్న ఆయుధం)ఆగస్టు 14
బహుజన విప్లవ వీరుడు, గోల్కొండను ఏలిన బహుజన చక్రవర్తి, గౌడ బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఆగస్టు 18న రాష్ట్ర ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని జై గౌడ్ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల మురళి గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని ఆర్అండ్బి గెస్ట్‌హౌస్‌లో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడారు.
పాపన్న గౌడ్ బహుజనుల హక్కుల కోసం చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైందని, ఆయనకు గౌరవార్థం హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, పాపన్న గౌడ్ వీరగాథలను పాఠ్యపుస్తకాలలో చేర్చడం ద్వారా కొత్త తరానికి ఆయన త్యాగ స్ఫూర్తి చేరవేయాలని సూచించారు.
“బహుజనుల గౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన ధీరుడి జయంతి రోజున ప్రభుత్వం గౌరవం తెలపాలి” అని రంగోల మురళి గౌడ్ అన్నారు.