ఎమ్మెల్యే సహకారంతో ప్రహరీ గోడ

*ఎమ్మెల్యే సహకారంతో ప్రహరీ గోడ కు పిల్లర్స్ వేయడం ప్రారంభం*

స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్యాట మీద ఎస్సీ మాల కమ్యూనిటీ హాల్ చుట్టూ ప్రహరి గోడ నిర్మాణం కొరకు అడిగిన వెంటనే నిర్మాణం చేస్తానని మాట ఇవ్వడంతో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానిపేట్ గ్రామంలో ప్యాట మీద ఎస్పీ కమ్యూనిటీ మాల సంఘ భవనము చుట్టు ప్రహరి గోడకి పిల్లర్స్ గుంతలు తీయడం ప్రారంభించడం జరిగిందని ప్యాట మీద ఎస్సీ మాల సంఘ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో మా యొక్క ఎస్సీ కమ్యూనిటీ మాల సంఘ భవనము చుట్టూ ప్రహరి గోడ కట్టించాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ని అడిగిన వెంటనే నిర్మాణ పనులు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాటతో ప్రహరి గోడకి సంబంధించిన సామాగ్రిని తెప్పించి బుధవారం రోజున ప్రహరీ గోడకి పిల్లర్స్ గుంతలు వేయడం జరిగిందని త్వరలోనే ప్రహరీ గోడ కూడా నిర్మించడం జరుగుతుందని తెలిపారు అడిగిన వెంటనే ప్రహరి గోడకి సహాయ సహకారాలు అందించిన స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి కి ప్యాట మీద మాల సంఘం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ బిజెపి అధ్యక్షులు దోమకొండ స్వామి, బీజేవైఎం కార్యదర్శి పోతరాజు రాజేష్, మండల ఉపాధ్యక్షులు నాతి వెంకట్ గౌడ్, భూత్ అధ్యక్షులు మెకానిక్ స్వామి, మంగలి వెంకట్, మాల సంఘ సభ్యులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now