పరీద్ పేట్ పాఠశాల పూర్వ విద్యార్థులు
నియోజకవర్గానికి ఆదర్శంగా నిలిచారు
– ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
కామారెడ్డి పాల్వంచ మండలం ఫరీద్ పేట గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షేట్కర్, రేరా కమిషనర్, కామారెడ్డి పూర్వ కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. పాఠశాలలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఫరీద్ పేట పూర్వ విద్యార్థులు నియోజకవర్గానికి ఆదర్శంగా నిలిచారన్నారు. పూర్వ విద్యార్థులందరూ కలిసి గ్రామ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారనీ, బాధ్యతగా గ్రామస్తులు
అందరూ కలిసి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించేలా చూడాలన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో విద్య భివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలబెట్ట పోతున్నారన్నారు.
విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించింది
డీఎస్సీ ప్రకటించి 10వేల మందికి పైగా ఉపాధ్యాయులను నియమించాం.
విద్య, వైద్య రంగాల్లో ప్రక్షాళనకు విప్లవాత్మక చర్యలు తీసుకున్నాం అని, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని మేం విశ్వసించాం అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలల్లో విద్య ప్రమాణాలు పెంచేందుకు విద్యా కమిషన్ ను నియమించాం అని, మెరుగైన విద్య వ్యవస్థ ఏర్పాటుకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని కమిషన్ ను ఆదేశించాం అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ స్కూల్ విధానం తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నాం అన్నారు.
ప్రభుత్వ గురుకులాలు, హాస్టల్స్ లో మెస్ చార్జీల సమస్యను పరిష్కరించాం అని, గతంలో ఎప్పుడూ లేని విధంగా డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులంతా ఒకే ప్రాంగణంలో చదువుకునేలా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. తొలి దశలో రూ.11,600 కోట్లతో 58 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపట్టాం అన్నారు. అనంతరం జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ మాట్లాడుతూ విద్య అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించిందన్నారు.
గత ప్రభుత్వలు ప్రైవేటు విద్యాసంస్థలతో చేతులు కలుపుకుని ప్రభుత్వ విద్యాసంస్థలను బ్రష్టు పట్టించాయనీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య పై ప్రత్యేక దృష్టి సారించి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి ముందుకు తీసుకెళ్తున్నాం అని విద్యాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.