పరికి చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు దోమల బెడద

చెరువు
Headlines :
  1. పరికి చెరువు పరిసర ప్రాంతాలలో దోమల నివారణ చర్యలు: కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పర్యవేక్షణ
  2. దోమల నిరోధక చర్యలు: దొడ్ల వెంకటేష్, ఎంటమాలజీ సిబ్బంది సహకారంతో పారిస్ చెరువులో పిచ్చకారి
  3. పరికి చెరువు పరిసర ప్రజలకు దోమల నివారణకు కీలక చర్యలు, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ సూచనలు

నివారణ చర్యలు చెపట్టిన

కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్

ప్రశ్న ఆయుధం డిసెంబర్ 07: కూకట్‌పల్లి ప్రతినిధి

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని గురుగోవింద్ సింగ్ నగర్ లోని పరికి చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు దోమల బెడద సమస్య ఎక్కువగా ఉందని స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ ఎంటమాలజీ సిబ్బందితో కలిసి దోమల నివారణ కోసం పరికి చెరువులోని తిమేపాస్ కెమికల్ డ్రోన్ యంత్రం సహాయంతో పిచ్చకారి చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దోమల నివారణకు తిమేపాస్ కెమికల్ డోన్ యంత్రం సహాయంతో పిచ్చకారి చేయడం వలన చెరువులో ఉన్నటువంటి దోమ గుడ్లు దోమ పిల్లలు అనగా దోమలు (లార్వ దశలోనే) అరికట్టవచ్చు అన్నారు కాబట్టి ప్రజలు కూడా తమవంతు బాధ్యత వహించి మన ఇంటి పరిసరాలు ఇంటి బయట లోపల ఎక్కువ రోజులు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు వారానికి ఒకసారైనా నీటి నిల్వలను తనిఖీ చేసుకోవాలన్నారు నీటి నిల్వల పాత్రలపైన ఎల్లప్పుడూ మూతలు ఉంచలని చెప్పారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గరికి వచ్చే ఎంటమాలజీ సిబ్బందికి సహకరించాలని అన్నారు. చెత్తను కూడా వీధుల్లోనూ కాలువలోను చెరువుల్లోనూ వేయకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాడుగౌడ్, గుడ్ల శ్రీనివాస్, కరణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now