సీఎం పర్యటన సందర్భంగా 1100 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి ప్రతినిధి, మే 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఈ నెల 23న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించి, జహీరాబాద్ పట్టణంలో బసవేశ్వర చౌక్, మాచునూర్ లో కే.వి పాఠశాల ప్రారంభోత్సవాలతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 1100 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్, బసవేశ్వర చౌక్, కే.వి పాఠశాల, సభాస్థలాలను ఎస్పీ ప్రత్యక్షంగా సందర్శించి, బందోబస్తు ఏర్పాట్ల గురించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం వివిధ జిల్లాల నుండి బందోబస్తుకు వచ్చిన అధికారులు, సిబ్బందికి బ్రేఫింగ్ ఇస్తూ.. తమకు కేటాయించిన డ్యూటీ ప్రదేశానికి నిర్ణీత సమయంలో చేరుకొని, వీఐపీ వెళ్ళే మార్గంలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని అన్నారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగడానికి అవకాశం ఉన్న సంభందిత సెక్టార్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. తిరిగి వీఐపీ వెళ్లిపోయే వరకు డ్యూటీ ప్రదేశాన్ని విడిచి వెళ్లారాదని, విధి నిర్వాహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించిన శాఖ పరమైన చర్యలుంటాయని అన్నారు. సమావేశానికి వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధులు తమకు కేటాయించిన పార్కింగ్ స్థలాలలో మాత్రమే వాహనాలు నిలపాలని, బందోబస్తులో ఉన్న పోలీసు సిబ్బందికి సహరించవలసిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, డీటీసీ అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావ్, జిల్లా డియస్పీ సైదా నాయక్, సత్యయ్య గౌడ్, ప్రభాకర్, వెంకట్ రెడ్డి, నరేందర్ జహీరాబాద్ ఇన్స్పెక్టర్స్ శివలింగం, హనుమంతు, ఎస్బి ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, సబ్-డివిజన్ పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now