నర్సాపూర్, నవంబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలో బస్టాండు వద్ద ఆటోలను ఇష్టానుసారంగా రోడ్డుపై నిలుపుతుండటంతో ప్రయాణికులు, ఇతర వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఆటోలను ఇష్టానుసారంగా రోడ్డుపై నిలపడంతో ఇతర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు కారణమవుతున్నాయి. ఉదయం, సాయంత్రం ఆటో డ్రైవర్లు రోడ్డు మధ్యనే వాహనాలను నిలిపేయడం వల్ల ట్రాఫిక్ గందరగోళం నెలకొంటోంది. బస్టాండ్ ప్రాంతానికి వచ్చే బస్సులు, కార్లు, బైక్‌లు వెళ్లే మార్గాలు ఆటోల వల్ల పూర్తిగా అడ్డు పడుతున్నాయి. దీంతో వాహనదారులు రద్దీ సమయంలో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. పరిస్థితిని గమనించిన స్థానికులు పలుమార్లు ఆటో డ్రైవర్లకు సూచించినా.. వారు పట్టించుకోకపోవడం లేదని పలువురు పేర్కొన్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి బస్టాండ్ చుట్టుపక్కల ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ఏర్పాటు చేయాలని, ఆటోలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకుని, ఆటో పార్కింగ్ నియమాలను అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
నర్సాపూర్ లో రోడ్డుపైనే ఆటోల పార్కింగ్..ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు
Published On: November 17, 2025 10:03 pm