బస్తీ చలో”లో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం – అంబేద్కర్ విగ్రహం శుభ్రత, ఆశ్రమంలో పండ్ల పంపిణీ

*”బస్తీ చలో”లో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం – అంబేద్కర్ విగ్రహం శుభ్రత, ఆశ్రమంలో పండ్ల పంపిణీ**

IMG 20250413 WA2054

జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 13

IMG 20250413 WA2052, సంక్షేమం బీజేపీతోనే సాధ్యం” అనే నినాదంతో కొనసాగుతున్న “బస్తీ చలో” కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు రాంపల్లి గ్రామ బస్ స్టాప్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నాగారం మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు కొండబోయిన నాగరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ కౌకుట్ల చంద్రారెడ్డి బస్ స్టాప్ వద్ద శుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సమీపంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రపరిచారు.

ఇందుకు కొనసాగింపుగా, వెస్ట్ గాంధీనగర్‌లోని మానసిక వికలాంగుల ఆశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ,

“ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుని బాధ్యత. డాక్టర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి. రాజ్యాంగాన్ని గౌరవించడం, సేవా దృక్పథంతో సమాజానికి ఆదర్శంగా జీవించడం అవసరం” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ కార్యదర్శి గణపురం శ్యామ్ సుందర్ శర్మ, మాజీ ఎంపీటీసీ తరిగొప్పుల బలరాం, మాజీ కౌన్సిలర్ బిజ్జా శ్రీనివాస్ గౌడ్, బొంగురాల శంకర్ రెడ్డి, మామిడి జంగారెడ్డి, మంచాల మహేందర్, పోతంశెట్టి వెంకటేశ్వరరావు, నెల్లుట్ల నవీన్, కర్ర వెంకటేశ్వరరావు, సురేందర్ రెడ్డి, ఏనుగు మహేందర్ రెడ్డి, కొండేటి రాజశేఖర్ రెడ్డి, నాగ మల్లేశ్వరరావు, భరత్ ముదిరాజ్, ఎలసాని శివరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment