లక్ష్యానికి మించి పార్టీ సభ్యత్వ నమోదు చేయించాలి
–బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు విపుల్ జైన్
ప్రశ్న ఆయుధం న్యూస్, నవంబర్ 11, కామారెడ్డి :
లక్ష్యానికి మించి పార్టీ సభ్యత్వ నమోదు చేయించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు విపుల్ జైన్ సూచించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో సోమవారం జరిగిన మండల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ చివరి దశకు చేరిందన్నారు. క్రియాశీల సభ్యత్వం కోసం బీజేపీ నాయకులు 100 ప్రాథమిక సభ్యత్వాలు చేయించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు బుస్స సురేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.