పారు బాయిల్డ్ రైస్ మిల్ డైవర్ కుటుంబానికి కుటుంబ భరోసా అందజేసిన
టిఆర్ఎస్కెవి అధ్యక్షులు చలువాది సైదులు
జనవరి 05హుజూర్ నగర్ మండలం.
బూరుగడ్డ గ్రామానికి చెందిన చింత శ్రీను గత 25 సంవత్సరాల నుండి పార్ బయెల్డ్ రైస్ మిల్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం చింత శీను అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారి కుటుంబానికి పారుబాయిల్డ్ టిఆర్ఎస్కెవి ఆధ్వర్యంలో 60 వేల రూపాయలు కుటుంబ భరోసా క్రింద ఆర్థిక సాయం అందించడం జరిగింది. అనంతరం అధ్యక్షులు చలువాది సైదులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ లేబర్ ఇన్సూరెన్స్, కుటుంబ భరోసా లాంటి ఇన్సూరెన్స్ ఉండాలని, మిల్లు డ్రైవర్లు జాగ్రత్తగా పని చేయాలని, అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే ఈఎస్ఐ హాస్పిటల్లో ఉచితంగా చికిత్స చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి. అధ్యక్షులు సలిగంటి జానయ్య, సిఐటియు అధ్యక్షులు చింతకాయల పర్వతాలు, సిహెచ్ ఎర్రయ్య, ఎం వీరబాబు ,ఎస్ బాలకృష్ణ ,
పి లింగయ్య, వి బ్రహ్మం,
పి వెంకన్న, పి మల్లయ్య సీతారాములు, బి వెంకటరెడ్డి లోకేష్ ,డ్రైవర్లు పాల్గొన్నారు.