*పార్వతీపురం ఆర్కే కళాశాల మెరుపులు: స్టేట్ సెకండ్, థర్డ్ ర్యాంకులు*
పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 13( ప్రశ్న ఆయుధం న్యూస్ )దత్తి మహేశ్వరావు
ఫస్ట్ బైపీసీలో 435 స్టేట్ సెకండ్ మార్కులు
*ఫస్ట్ ఎంపీసీలో 464 స్టేట్ థర్డ్ మార్కులు
*సెకండ్ ఎంపీసీలో పార్వతీపురం టౌన్ ఫస్ట్ 985 మార్కులు
*విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్, జాయింట్ డైరెక్టర్లు
పార్వతీపురం:
ఇంటర్మీడియట్ బోర్డు శనివారం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో తమ కళాశాల విద్యార్థులు ఫస్ట్ బైపిసి లో స్టేట్ సెకండ్, ఫస్ట్ ఎంపీసీలో స్టేట్ థర్డ్ మార్కులు సాధించినట్లు పార్వతీపురం పట్టణానికి చెందిన ఆర్కే జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బి.భూపాల్ తెలిపారు. శనివారం ఆయన తమ కళాశాలలో విలేకరులతో మాట్లాడుతూ తమ ఆర్కె జూనియర్ కళాశాలలో ఫస్ట్ బైపీసీలో చదువుతున్న వసంతాడ చాందిని ( పార్వతీపురం, వివేకానంద కాలనీ ), అనే విద్యార్థిని 440 మార్కులు గాను 435 స్టేట్ సెకండ్ మార్కులు సాధించినట్లు తెలిపారు. అలాగే ఫస్ట్ ఎంపీసీ చదువుతున్న గెంబలి దీప్తి ( లక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలం ) 470 మార్కులకు గాను 464 స్టేట్ థర్డ్ మార్కులు కైవసం చేసుకున్నట్లు తెలిపారు. సెకండ్ ఎంపీసీ చదువుతున్న బల్లా దీపిక ( అప్పయ్యపేట, సీతానగరం మండలం) 1000 మార్కులకు గాను 985 పార్వతీపురం టౌన్ ఫస్ట్ మార్కులు సాధించినట్లు తెలిపారు. ఆది నుండి తమ కళాశాల విద్యార్థులు స్టేట్, జిల్లా, పట్టణ స్థాయిలో అత్యధిక మార్కులు సాధిస్తున్నారన్నారు. అలాగే ఫస్ట్ ఎంపీసీలో 45 మంది విద్యార్థులు 400కు పైగా మార్కులు సాధించారన్నారు. ఫస్ట్ బైపిసి లో ఆరుగురు విద్యార్థులు 400కు పైగా మార్పులు సాధించారన్నారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, ఫలితాలకు కారకులైన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని ఆర్కే జనహిత విద్యాసంస్థల కరెస్పాండెంట్ పూడు రామకృష్ణ, జాయింట్ డైరెక్టర్ పూడు ఆశ అభినందించారు. విజయం సాధించిన విద్యార్థులను కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం అభినందించింది. భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.