జడ్పీ సమావేశంలో పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర. 

జడ్పీ సమావేశంలో పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర.

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 5 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తమహేశ్వరరావు

పార్వతీపురం: ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పాల్గొన్నారు శుక్రవారం ఉదయం జరిగిన సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ముందుగా అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఉమ్మడి జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు గురించి సుదీర్ఘ చర్చించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయ్ చంద్ర పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్లు కాలువలు, తాగునీటి, వనరులు గురించి ప్రస్తావించి నిధులు కేటాయించాలని ప్రతిపాదించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment