RTC బస్సులో ప్రయాణికుడికి గుండెపోటు

 

రన్నింగ్ బస్ లో ఓ ప్రయాణికుడు గుండెపోటుతో కుప్పకూలాడు. శుక్రవారం మధ్యాహ్నం జీడిమెట్ల ఆర్టీసీ డిపో బస్సులో మురళీకృష్ణ (67) అనే వ్యక్తి బస్సు ఎక్కాడు. సీట్లో కూర్చున్న వెంటనే గుండెనొప్పి వస్తోందంటూ పడిపోయాడు. కండక్టర్‌ అంజలి వెంటనే బస్సు ఆపాలని చెప్పి.. సీపీఆర్‌ చేశారు. ఆమెతోపాటు మరో ప్రయాణికుడు కూడా సీపీఆర్‌ చేయడంతో స్పృహలోకి వచ్చాడు. వెంటనే అంబులెన్స్‌లో సూరారంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది.

Join WhatsApp

Join Now