కామారెడ్డి పట్టణంలో పాస్ పోర్ట్ సేవలు* 

*కామారెడ్డి పట్టణంలో పాస్ పోర్ట్ సేవలు*

 

ప్రశ్న ఆయుధం న్యూస్, కామారెడ్డి :

 

కామారెడ్డి పట్టణంలోని ప్రాంతీయ పోస్ట్ ఆఫీసు ఆవరణలో ప్రత్యేక వాహనంలో పాస్ పోర్టు సేవలను వినియోగదారులకు అందిస్తున్నారు. ఈ పాసు పోర్టు సేవలు ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందుతాయని ఇక్కడ నూతన పాస్ పోర్టులు, రెన్యువల్ సంబంధించిన పాస్పోర్టులు, ఇతర పాస్ పోర్ట్ సేవలు కూడా అందిస్తున్నామని నిజామాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి తెలిపారు. నిజామాబాద్ పట్టణంలోనే పాస్పోర్ట్ కార్యాలయము ఉన్నందున అక్కడి వరకు వినియోగదారులు వెళ్ళనవసరం లేకుండా ప్రస్తుతం కామారెడ్డి పట్టణంలోనే కామారెడ్డి ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment