పట్టించుకోని ఆర్అండ్ బీ అధికారులు
సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెరు–ఇంద్రేశం రోడ్డు గుంతల మయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజూ ఈ రోడ్డుపై వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధ్వానంగా తయారైన రోడ్డుకు మోక్షం ఎప్పుడోస్తుందని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. పటాన్ చెరు నుంచి ఇంద్రేశం వరకు రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి అధ్వానంగా తయారైంది. ఆర్అండ్ బీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి, ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు.