కామారెడ్డి జిల్లా కేంద్రంలో నకిలీ ఫోన్ బ్యాటరీ లను విక్రయిస్తున్న పటేల్ మొబైల్ కంపెనీ… శ్రీధర్

కామారెడ్డి జిల్లా కేంద్రంలో నకిలీ ఫోన్ బ్యాటరీ లను విక్రయిస్తున్న పటేల్ మొబైల్ కంపెనీ

– గ్యారెంటీ అని చెబుతూ అమాయకులకు విక్రయిస్తున్న వైనం

IMG 20250222 WA0015

విలువ చేసే బ్యాటరీ 800 లకు విక్రయం

IMG 20250222 WA0013 జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్ల గల న్యూ పటేల్ మొబైల్ మల్టీ బ్రాండ్ సెంటర్ నిర్వాహకులు వారి వద్దకు మొబైల్ రిపేర్ చేయించుకోవడానికి వచ్చిన వారికి నకిలీ వస్తువులను అంటగడుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. గ్యారెటీ ఇస్తూ గ్యారెంటీ దానికి ఇవ్వలేదని దబాయిస్తూ పలువురు మొబైల్ రిపేర్ చేసుకున్న వ్యక్తులను బెదిరించినట్లు సమాచారం. ఓ వ్యక్తి వారి వద్ద ఎనిమిది వందలకు తన ఫోన్లో బ్యాటరీ వేయించుకోగా రెండు నెలలు కూడా పూర్తికాకముందే ఆ బ్యాటరీ ఉబ్బడంతో వారి వద్దకు వెళ్లగా మాకు సంబంధం లేదు. బ్యాటరీ మీద రాసింది మేము రాయలేదంటూ దుబాయించడం, మేము నీకు ఏమి చెప్పలేదు కావాలంటే మా వద్ద బోర్డు ఉన్నది చూసుకోండి అని చెప్పారని బాధితుడు పేర్కొంటున్నారు. సదర్ బాధితులు ఆ దుకాణం వద్దకు వెళ్లి రాగానే ఆ బోర్డు ఏర్పాటు చేసినట్లు బాధితులు పేర్కొంటున్నారు. బ్యాటరీకి ప్రధానంగా రెండే సమస్యలు ఉంటాయి ఒకటి చార్జింగ్ నిల్వ ఉండకపోవడం, బ్యాటరీ ఉబ్బడం లాంటి ఈ రెండు సమస్యలు తప్ప మరో సమస్య ఆ బ్యాటరీ కి ఎలాంటిది బ్యాటరీ ఉండదు అది తెలిసి కూడా దానికి గ్యారెంటీ ఇస్తూ ఆ తర్వాత మాకు సంబంధం లేదని చెబుతూ వినియోగదారుల్ని బెదిరిస్తున్నట్లు సమాచారం. రెండు నెలలు పూర్తికాకముందే తన బ్యాటరీ ఉబిందని సంబంధిత పటేల్ మొబైల్ దుకాణం వద్దకు వెళ్లగా దాని నిర్వాహకులు ఉబ్బిన దానికి మాకు సంబంధం లేదని దురుసుగా ప్రవర్తించినట్లు సంబంధిత కొనుగోలుదారుడు పేర్కొంటున్నారు. ఈ షాపులపై పర్యవేక్షణ చేసే అధికారులు సరైన పద్ధతులు పర్యవేక్షణ చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

గ్యారెంటీ ఉంది అంటేనే 800 రూపాయలు పెట్టి కొనుగోలు చేశాను బ్యాటరీ కొనుగోలుదారు ( శ్రీధర్ )

నా ఫోన్లో చార్జింగ్ ఆగడం లేదని పటేల్ మొబైల్ మల్టీ బ్రాండ్ సెంటర్ కు వెళ్లగా బ్యాటరీ చెడిపోయిందని కొత్త బ్యాటరీ వేసుకోవాలని సూచించారు. దీంతో గ్యారంటీ ఉందా అని అడగగా ఆరు నెలల గ్యారంటీ ఏమి జరిగినా మేము కొత్త బ్యా ట్రీ ఇస్తామని చెప్పారు. రెండు నెలలు కూడా పూర్తికాకముందే బ్యాటరీ ఉబ్బింది దానిపైన ఆరు నెలల గ్యారంటీ అని రాశారు. నేను వెళ్లగా ఉబ్బితే మాకు సంబంధం లేదు అన్నారు. నేను బ్యాటరీ చెడిపోయిన రోజు వెళ్లిన సమయంలో బోర్డు లేదు. నేను వెళ్లి బ్యాటరీ తీసుకొని వేరే బ్యాటరీ ఇవ్వాలని కోరగా అక్కడ బోర్డు ఉంది చూసుకోండి అంటూ బోర్డును చూపెడుతూ బెదిరించారు. నాకు జరిగినట్లుగా ఇంకొకళ్లకు జరగకూడదని నేను ప్రభుత్వ

అధికారులను కోరుతున్నాను.

 బాధితుడు శ్రీధర్

Join WhatsApp

Join Now

Leave a Comment