(అక్కినేని శతజయంతి)_
కల ఇదనీ నిజమిదనీ_
తెలియదులే బ్రతుకింతేనులే.._
అలా అనుకుని ఆగిపోలేదు
ఆ చొక్కి దవడల కుర్రాడు..
*_కల కానిది విలువైనది_*
*_బ్రతుకు కన్నీటి ధారలలోనే_*
*_బలిచేయకు.._*
అనుకుంటూ
సక్సెస్ దారిలో
పరుగులు తీసిన *బాటసారి!*
*ఎన్టీఆర్..*
ఈ మూడక్షరాలు
సంచలనమైతే..
*ఏయెన్నార్..*
అనే మరో మూడక్షరాలు నటనకు బహువచనం…
ఈ ఇద్దరూ కలిస్తే
క్రమశిక్షణకు నిర్వచనం..!
అన్న రాకమునుపే
ఈ తమ్ముడు
ఓ సూపర్ స్టార్..
అప్పటికే వేషాల కోసం
*ధర్మపత్ని* తో కలిసి
*కీలుగుఱ్ఱం* ఎక్కి *మాయాలోకం* చుట్టేసిన
*బాలరాజు..*
పోటీ రాగానే
తానేమిటో
తెలుసుకుని
వక్రదృష్టి లేకుండా
తనకు
తగ్గ పాత్రలే
ఎన్నుకుని
హిట్లు కొట్టిన *చక్రపాణి..*
బ్రదర్ తో కలిసి *మాయాబజార్* లో
వీరవిహారం చేసి
*గుండమ్మకథ* ను
నడిపించిన
*_నటసామ్రాట్టు!_*
నవరసాలను
*నవరాత్రు* లలో పోషించి
మెప్పించిన *విప్రనారాయణ*
విషాదానికి *దేవదాసు..*
*అనార్కలి* తో
భగ్నప్రేమకు సలీం..
రౌద్రానికి *చాణక్యుడు..*
మీకు మీరే మాకు మేమే
సున్నితమైన హాస్యానికి
*మిస్సమ్మ* రాజు..
శౌర్యానికి కిరీటి..
ఇలా ఎన్నో పాత్రలను
*_రసిక రాజ_*
*_తగువారము కామా.._*
అంటూ పోషించి
*జయభేరి* మోగించిన
*దసరాబుల్లోడు..!*
ఇక శృంగారం
ఎన్నో పాత్రల అనుభవసారం..
అరవై ముగ్గురు
హీరోయిన్లకు చేసేసాడు
*ప్రేమాభిషేకం..!*
*_అక్కినేని జీవితం_*
*_సినిమా కథ కాదు.._*
*_సినిమానే ఆయన జీవితం_*
చిన్నప్పుడు విద్య
నేర్వలేకపోయిన
*పల్లెటూరి బావ..*
హీరోగా మారినాక *కాలేజీబుల్లోడు* కాకపోయినా
ఇంగ్లీషు నేర్చేసిన *దొరబాబు..*
కళామతల్లికి *_దత్తపుత్రుడు!_