●ఎప్పుడు వచ్చినా సరే ఇలాగే చేస్తారు అసలు వైద్యులు ఉండరు అని ఆవేద వ్యక్తం చేస్తున్న రోగులు
ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 15 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా కార్యక్రమం అయిపోయిన తర్వాత విధి నిర్వహించకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అక్కడ వచ్చిన రోగులు అక్కడ ఉన్న నర్సును వైద్యం చేయమని కోరగా ఆమె నేను గోలీలు మాత్రమే ఇస్తాను ఇంజక్షన్లు ఇవ్వను అని స్థానిక రోగులకు చెప్పగా వారు ఎప్పుడు వచ్చినా సరే ఇలాగే చేస్తారు అసలు వైద్యులు ఉండరు అని నర్స్ తో వాగ్వాదానికి దిగారు.. పేద ప్రజలు ఏదైనా రోగం వస్తే ప్రవేట్ ఆసుపత్రికి వెలలేక గవర్నమెంట్ వస్తే ఇక్కడ వైద్యులు అందుబాటులో ఉండరు పేద ప్రజలు ప్రభుత్వాసుకి కాకుండా ఎక్కడికి వెళ్తారు వైద్యులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి కదా అని విలేకరులతో వారి సమస్యను చెప్పారు ఈ విషయం పై అధికారులు చర్యలు తీసుకొని వ్యాధులు ఉండేలా చూడాలని రోగులు కోరారు