సంగారెడ్డి/సదాశివపేట, ఆగస్టు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ (కె) ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డా.పోట్రు.రామకృష్ణ జాతీయ స్థాయి పద్మచక్ర పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి జాతీయ స్థాయి పురస్కారాలు అందజేశారు. ఇందులో భాగంగా రామకృష్ణ పద్మచక్ర పురస్కారాన్ని మాజీ మంత్రి బాబు మోహన్, మాజీ ప్రభుత్వ విప్ గొంగడి సునీత, న్యూమరాలజిస్ట్ దైవాజ్ఞ శర్మ చేతుల మీదుగా అందుకున్నారు. విద్యా, పర్యావరణ, రక్షణ రంగంలో చేసిన సేవలకు గాను రామకృష్ణకు ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. తనకు జాతీయ స్థాయి పురస్కారాన్ని అందజేసినందుకు రామకృష్ణ నిర్వాహకులకు ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెట్టుగూడ కార్పొరేటర్ సుజాత, ఉన్నత విద్య వైస్ చైర్మన్ ప్రొ.ఎటుకుల.పురుషోత్తం, చైర్మన్ శ్రీనివాసరాజు, శ్రీధరాచార్యులు, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. పద్మచక్ర పురస్కారం అందుకున్న రామకృష్ణను మండల విద్యాధికారి శంకర్, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రాజశ్రీ, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు తల్లిదండ్రులు, విద్యార్థులు అభినందించారు.
పద్మచక్ర జాతీయ పురస్కారం అందుకున్న పోట్రు.రామకృష్ణ
Oplus_131072