*నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో బాలినేని భేటీ*
*అమరావతి :సెప్టెంబర్ 19*
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, జనసేన పార్టీ పార్టీలో చేరుతున్నట్లు, విశ్వాసనీ య సమాచారం..
ఇప్పటికే తన రాజీనామా లేఖలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి పంపిన బాలినేని.. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు.. ఇక, జనసేన పార్టీ నేతలతో టచ్‌లోకి వెళ్లారు.
బాలినేని.. ఇక, ఈ రోజు విజయవాడలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారు బాలినేని.. ఇప్పటికే జనసేన కీలక నేత నాగబాబుతో మంతనాలు కూడా జరిపారు బాలినేని..
అయితే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ అనంతరం జనసేనలో ఎప్పుడు చేరతారనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది..