Site icon PRASHNA AYUDHAM

అధికారులకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్..

అధికారులకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్..

అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం జరిగిన ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ స్మగ్లింగ్‌పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు..

బుధవారం జరిగిన ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ స్మగ్లింగ్‌పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆఖరికి పెట్రోల్‌లో కూడా కల్తీ పెరిగిపోతోందని, స్వయానా మంత్రి నాదెండ్ర మనోహర్ వెళ్లి సీజ్ చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు.

ఇసుకను స్ట్రీమ్ లైన్ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇన్నేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులు పాలైందని, అధికారులకు కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్ షిప్‌లో ఏపీలో సుస్థిర పాలనను అందిచేందుకు అంతా సహకారం అందించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

Exit mobile version