సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటా: పవన్‌

సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటా: పవన్‌ కల్యాణ్‌

సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికే తిరుపతికి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు. ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మమని వివరించారు..తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి సభలో ఆయన మాట్లాడారు. ”ఏడుకొండల వాటికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటాం. అన్నీ ఓట్ల కోసమే చేస్తామా? ఓట్ల కోసమే మాట్లాడతామా? నా జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని ఊహించలేదు. నాకు అన్యాయం జరిగితే బయటకు రాలేదు. తిరుమలలో అపచారం జరుగుతోంది.. సరిదిద్దండి అని గతంలో చెప్పా. పట్టించు కోలేదు. అందుకే 11 సీట్లకే పరిమితమయ్యారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. కలియుగంలో ధర్మానికి ప్రతిరూపం వేంకటేశ్వరస్వామి..ఇతర మతాలను చూసి నేర్చుకోవాలి. సనాతన ధర్మానికి కొన్ని దశాబ్దాలుగా అవమానం జరుగుతూనే ఉంది. మనం గౌరవం ఇవ్వడంలేదు. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికే వచ్చా. డిప్యూటీ సీఎంగా, జనసేన అధినేతగా ఇక్కడికి రాలేదు. హిందువుగా.. భారతీయుడిగా ఇక్కడికి వచ్చా. భిన్నత్వంలో ఏకత్వం చూపేది సనాతనధర్మం. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే అవహేశన చేశారు. తిరుమలకు వెళ్తే నా కుమార్తెతో డిక్లరేషన్‌ ఇప్పించా. నేను సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళన చేసి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటా” అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు..

 

లౌకికవాదం పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారు.. 

 

”దేశంలో హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా చాలా దాడులు జరిగాయి. రాముడిని తిడితే నోరెత్తకూడదు.. మనది లౌకికవాద దేశం అంటారు. ఇతర మతాల్లో వాళ్ల దేవుడిని తిడితే వదిలేస్తారా? లౌకికవాదం పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారు. హిందువులకు అన్యాయం జరిగితే మాట్లాడే హక్కు లేదు? సనాతన ధర్మాన్ని సూడో సెక్యులరిస్టులు విమర్శిస్తున్నారు. సనాతన ధర్మం, హిందూ దేవుళ్లను విమర్శించే వారు ఎక్కువయ్యారు. ఇస్లాం దేశాల మాటలు సూడో సెక్యులరిస్టులకు వినపడవు. బంగ్లాదేశ్‌.. ఇస్లాం రాజ్యంగా ప్రకటించుకున్నా ఎవరూ మాట్లాడరు. సనాతన ధర్మాన్ని అంతం చేయాలని కొంతమంది అనుకుంటున్నారు” అని పవన్‌ అన్నారు..

Join WhatsApp

Join Now