*కరీంనగర్ బిడ్డలుగా “పైలం పిలగా” సినిమాతో ఈనెల 20న మన ముందుకు వస్తున్నారు*
*కరీంనగర్ హీరో.. కరీంనగర్ డైరెక్టర్.. కరీంనగర్ ప్రొడ్యూసర్ ల కలయికతో పైలం పిలగా సినిమా రూపుదిద్దుకుంది.*
*ఈనెల 20న రిలీజ్ కాబోతున్న ” పైలం పిల్లగా” సినిమాను ఆదరించండి…. కరీంనగర్ కాళమ్మ తల్లి బిడ్డలను ఎంకరేజ్ చేయండి*
*మీడియా సమావేశంలో సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆనంద్ గుర్రం , రామకృష్ణ, హీరో సాయి తేజ కల్వకోట*
*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో సెప్టెంబర్ 17*
కరీంనగర్ హీరో నటించిన, కరీంనగర్ డైరెక్టర్ తో , కరీంనగర్ ప్రొడ్యూసర్ చే కరీంనగర్ లోనే షూటింగ్ జరుపుకున్న సినిమా, – పైలం పిలగా తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 20న ఘనంగా విడుదలవుతోందని సినిమా డైరెక్టర్ ఆనంద్ గుర్రం తెలిపారు. మంగళవారం రోజున కరీంనగర్లోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో డైరెక్టర్ ఆనంద్ గుర్రం హీరో సాయి తేజ కల్వకోట , నటుడు ప్రణవ్ సోను , గీత రచయిత చంద్రమౌళి, నిర్మాత రామకృష్ణ లు మాట్లాడారు.
హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై ‘పైలం పిలగా’ సినిమాను నిర్మించడం జరిగిందన్నారు. ఈ సినిమాలో ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలు ట్రేండింగ్ లో నడుస్తున్నాయన్నారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కి, ట్రైలర్ కి మంచి స్పందన వచ్చిందని, చిన్న సినిమా అయినా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిందన్నారు. ముఖ్యమైన కథాంశంతో , ఆసక్తికరమైన సన్నివేశాలతో పైలం పిలగా సినిమా
హాస్యభరిత వ్యంగ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు. సినిమాలోసాయి తేజ కల్వకోట, పావని కరణం జంటగా నటించారన్నారు. . చిత్రంలోని పాటలను, ట్రైలర్ లను ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల, హరీష్ శంకర్, వెంకటేష్ లు లాంచ్ చేసి, సినిమా యూనిట్ ను అభినందించారని తెలిపారు. సినిమా టీజర్ ట్రైలర్ ను చూసిన హీరోనందమూరి బాలకృష్ణ తెలంగాణ యాసలోని డైలాగ్స్ కి ఫిదా అయ్యి సినిమా యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారన్నారు.
*వందకు పైగా యాడ్స్ ఫిలిమ్స్ చేసిన ఆనంద్ గుర్రం దర్శకత్వంలో వస్తున్న చిత్రం “పైలం పిలగా”*
నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, వంటి టాలీవుడ్, బాలీవుడ్ అగ్రనటులతో సహా వందకి పైగా యాడ్ ఫిలిమ్స్ కి దర్శకత్వం వహించిన ఆనంద్ గుర్రం దర్శకత్వం లో వస్తోన్న మొదటి చిత్రం ‘పైలం పిలగా’ విడుదలకు సిద్ధమవుతోంది. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం లో డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. యశ్వంత్ నాగ్ ఆరు అద్భుతమైన పాటలతో మెలోడియస్ సంగీతాన్ని అందించారు. కెమెరా సందీప్ బద్దుల, ఎడిటింగ్ రవితేజ, శైలేష్ దారేకర్, స్టైలిస్ట్ హారిక పొట్ట, లిరిక్స్ ఆనంద్ గుర్రం, అక్కల చంద్రమౌళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ ఒడ్నాల పనిచేసిన ఈ చిత్రానికి రవి వాషింగ్టన్, కృష్ణ మసునూరి, విజయ్ గోపు సహా నిర్మాతలుగా వ్యవహరించారు.