భవిష్యత్తు యువజన కాంగ్రెస్ నాయకులదే,ఎమ్మెల్యే పాయం, తుళ్లూరి బ్రహ్మయ్య

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 8 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ కు అభినందనలు తెలిపిన నేతలు.గడిచిన పదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ నాయకులు వెన్నెముకగా ఉండాలని భవిష్యత్తు యువజన కాంగ్రెస్ నాయకులదేనని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య అన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 12 వ తేదీన పెద్దమ్మ తల్లి గుడి నుండి కొత్తగూడెం విద్యానగర్ లోని మంత్రి పొంగులేటి క్యాంప్ ఆఫీస్ వరకు చెప్పట్టనున్న విజయోత్సవ ర్యాలీలో పాల్గొనాలని వారిని ఆహ్వానించారు.యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ తో పాటుగా గెలుపొందిన నాయకులను వారు సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు యువజన కాంగ్రెస్ నాయకులు బృందాలుగా ఏర్పడాలని కలసికట్టుగా ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలని అన్నారు. ఏలాంటి కేసులకు భయపడకుండా పార్టీకి అండగా నిలిచిన వారికి భవిష్యత్తులో మంచి గుర్తింపు ఉంటుందని తెలియజేశారు. ఇందులో భాగంగా యువజన కాంగ్రెస్ ఉన్నటువంటి పలువురు నాయకులను వారి పనితీరుతో పాటు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక వడిదోడుకులకు గురై కేసులు నమోదు చేయబడిన వారిని అభినందించి తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని భరోసా కల్పించారు.త్వరలో యువజన కాంగ్రెస్ నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమం చీకటి కార్తీక్ వెంట గులాం మతిన్, కుంచం వెంకటేష్, తాటి పవన్, రామూర్తి, స్థానిక నాయకులు మరియు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now