Site icon PRASHNA AYUDHAM

అదిలాబాద్–నిర్మల్ అబ్జర్వర్‌గా పీసీసీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

IMG 20251010 194819

అదిలాబాద్–నిర్మల్ అబ్జర్వర్‌గా పీసీసీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సంకల్పం 

– స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం లక్ష్యం

 

అదిలాబాద్, అక్టోబర్ 10 (ప్రశ్న ఆయుధం) 

అదిలాబాద్ మరియు నిర్మల్ జిల్లాలకు పీసీసీ అబ్జర్వర్‌గా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కామారెడ్డికి చెందిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి ఈ సందర్భంగా అదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో టీ పీ సీ సీ నూతన కమిటీల ఏర్పాటుతోపాటు పార్టీ కార్యకలాపాల సమన్వయం బాధ్యతలను అప్పగించారు. పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన పార్టీ బలోపేతానికి అందరినీ కలుపుకొని పనిచేస్తానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యమని పేర్కొన్నారు.

Exit mobile version