బిజెపి, కేంద్ర మంత్రి బండి సంజయ్ పై పీసీసీ చీఫ్ వి మతి లేని వ్యాఖ్యలు

బిజెపి, కేంద్ర మంత్రి బండి సంజయ్ పై పీసీసీ చీఫ్ వి మతి లేని వ్యాఖ్యలు

ఓట్ చోరీతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా..?

పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కరీంనగర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర

కరీంనగర్ ఆగస్ట్ 25 ప్రశ్న ఆయుధం

భారతీయ జనతా పార్టీపై, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ మతి లేకుండా మాట్లాడుతున్నారని , ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి , సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర అన్నారు. బిజెపి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసిస్తూ బిజెపి తిమ్మాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం రోజున దిష్టిబొమ్మ దహనం చేశారు అనంతరం కళ్యాణ్ చంద్ర మాట్లాడుతూ మహేష్ గౌడ్ కు మతిభ్రమించినట్లు ఉందని అందుకే బిజెపి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై మహేష్ గౌడ్ అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు ఓట్ చోరీతో 8 పార్లమెంటు సీట్లు తెలంగాణలో బిజెపి గెలిస్తే, కాంగ్రెస్ కూడా ఓట్ చోరీతో గెలిచి అధికారంలోకి వచ్చిందా అనే విషయంపై మహేష్ గౌడ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహేష్ గౌడ్ వి దిమాక్ లేని మాటలని ఓట్ చోరీ జరిగితే తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే 8 పార్లమెంట్ సీట్లు బిజెపి ఎందుకు వస్తాయని ఘాటుగా విమర్శించారు. ప్రజల కోసం, హిందుత్వం కోసం , దేశం కోసం , దేవుళ్ళ కోసం బిజెపి ఆలోచన చేస్తుందని కొట్లాడుతుందని వీటి కోసం బీజేపీ పనిచేస్తే మహేష్ గౌడ్ దురంకారంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. దేవుడు పేరు చెప్పిబిజెపి ఓట్లను బిచ్చమడుకుంటుందని మహేష్ గౌడ్ వ్యాఖ్యలు చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు దేశ ప్రజలు బిజెపిని అక్కున చేర్చుకున్నారని తెలిపారు. ముఖ్యంగా దేశం ఎవరి పాలనలో భద్రంగా ఉంటుందదనే విషయం ప్రజలకు స్పష్టం గా అర్థమైందని , అందుకే వరుసగా మూడోసారి కేంద్రంలో బిజెపి (ఎన్డీఏ) సర్కార్అధికారంలోకి వచ్చిందని తెలిపారు. 55 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ గురించి ప్రజలకు అర్థమైంది కాబట్టి కాంగ్రెస్ ను ప్రజలు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారని , దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అయిందన్నారు. ఆరూ గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను నమ్మించి మోసం చేసే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. 20 నెలలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని, గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేకపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజలకు చేసిన మోసం గారడి అర్థమైందని , నేడు అ కాంగ్రెస్ పై తిరగబడే స్థితి వచ్చిందన్నారు.. అందుకే ప్రజల దృష్టిని మరల్చడానికి జనహిత యాత్ర పేరిట కాంగ్రెస్ దొంగ రాజకీయ నాటకాలు మొదలుపెట్టిందని పేర్కొన్నారు యాత్రలో కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలకు చేసిన మేలు ఏది లేక , బిజెపిపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గెలుపు పై మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపనీయమన్నారు. కరీంనగర్ పార్లమెంటు సర్వతో ముఖ అభివృద్ధి కోసం కృషి చేస్తూ, వేలకోట్ల నిధులతో కరీంనగర్ పార్లమెంటు ముఖచిత్రాన్ని బండి సంజయ్ కుమార్ మారుస్తున్నారని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ ప్రజల ఆశీస్సులుబండి సంజయ్ కుమార్కు ఉండడంతోనే రెండవసారి భారీ మెజారిటీతో ఆయన గెలుపొందారని తెలిపారు. అలాంటి గెలుపును , కరీంనగర్ పార్లమెంట్ ప్రజల తీర్పును అపహస్యం చేసే విధంగా మహేష్ గౌడ్ వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుండాలన్నారు. మహేష్ గౌడ్ వెంటనే కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.బిజెపి జిల్లా ఈసీ మెంబర్ బూట్ల శ్రీనివాస్.బీజేవైఎం మండల అధ్యక్షుడు గడ్డం అరుణ్ కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి వేల్పుల రవీందర్ యాదవ్ బీజేవైఎం జిల్లా ఈసీ మెంబర్ బండి సాగర్ అన్నాడి రమణారెడ్డి రామిడి మహేందర్ రెడ్డి సుద్దాల సతీష్ బుడిగే మహేష్ గౌడ్ కామెర వినయ్ కామర పవన్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment