Site icon PRASHNA AYUDHAM

కామారెడ్డి పర్యటనకు వచ్చిన పిసిసి ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త కు సన్మానం.

IMG 20250702 WA0402

కామారెడ్డి పర్యటనకు వచ్చిన పిసిసి ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త కు సన్మానం.

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 2

 

జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జిగా ఇటీవల నియామకమైన ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా కామారెడ్డి పర్యటన కు వచ్చిన కల్కి మానవ సేవా సమితి, కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ల సంయుక్త ఆధ్వర్యంలో కల్కి ఆలయంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందనీ ఐ వి ఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలిపారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను పొందాలని ఆకాంక్షిస్తూ, ఆర్యవైశ్యుల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనతోపాటు ఆలయానికి విచ్చేసిన పిసిసి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావును సన్మానించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ గంప ప్రసాద్, ఆలయ సేవకులు ఎర్రం విజయ్, ఎర్రం సూర్యకాంతం, నాయకులు గోనె శ్రీనివాస్, కిరణ్, సర్వర్ లు పాల్గొన్నారు.

Exit mobile version