పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కొత్తగా ఎన్నికైన జేబీఎం చిల్డ్రన్స్ టీమ్‌ను సన్మానించారు.
కూకట్పల్లి (ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 17
కూకట్పల్లి నియోజకవర్గం,పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , జైపూర్‌లో జరిగిన జాతీయ సమైక్యతా శిబిరం తితిలిలో పాల్గొన్న జేబీఎం తెలంగాణ బృందాన్ని అభినందించి, కొత్తగా ఎన్నికైన చిల్డ్రన్స్ టీమ్‌ను సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన, తెలంగాణలో రాబోయే జాతీయ శిబిరాన్ని స్వాగతించారు. అలాగే, రాష్ట్ర చైర్మన్,మామిడి రిషికేష్ రెడ్డి, రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఇన్‌ఛార్జ్, జేబీఎం తెలంగాణ జిట్ట సునీల్ కుమార్ యాదవ్‌లు, కొత్త సంస్థ నిర్మాణంలో చేసిన కృషిని ప్రశంసించారు.
వి సంతోష్,టి రాకేష్,సాయి కృష్ణ నర్ల, అంబటి తులసి, ప్రవీణ్ కుమార్, మైత్రి.ఎ, రోహిత్, హర్షిత్, గీత మరియు ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.