దారి దోపిడీలు, దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర పార్థి దొంగల ముఠా సబ్యులపై PD ఆక్ట్ నమోదు. 

• దారి దోపిడీలు, దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర పార్థి దొంగల ముఠా సబ్యులపై PD ఆక్ట్ నమోదు.

 

• ఒక సంవత్సర కాలం పాటు బెయిల్ లేకుండా జైలుకే పరిమితం.

• తరచూ నేరాలకు పాల్పడుతున్న వారికి PD ఆక్ట్ తప్పదు.

జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్.

 

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 5

 

 

 

1) చోండా అలియాస్ కూలీ పవార్, తండ్రి: కిషన్ పవార్, వ: 30 సం.లు ,

2) జాకీ గుజ్జియ బోస్లే, తండ్రి: గుజ్జియ బోస్లే, వ: 27 సం.లు,

3) హరీష్ పవార్ @ హర్ష, తండ్రి: గుడ్డు థడ్కే పవార్, వ: 18 సం.లు , మరియు

4) అనురాగ్ రత్నప్ప బోస్లే, తండ్రి పేరు: రత్నప్ప బోస్లే, వ: 50 సం.లు, వృత్తి: కూలీ, నివాసం వార్ధా జిల్లా, మహారాష్ట్ర రాష్ట్ర కు చెందిన నలుగురు నిందితులుకు ఈరోజు తేదీ. 5.7.2025 నాడున నిజామాబాద్ సెంట్రల్ జైల్ యందు PD యాక్ట్ కింద ఉత్తర్వులు అందజేయడం జరిగినది. వీరు కామారెడ్డి, నిజామాబాద్ మరియు అదిలాబాద్ జిల్లాల యందు (9) దారి దోపిడీలు, దొంగతనలకు పాల్పడిన అంతర్రాష్ట్ర పార్థి దొంగల ముఠా సబ్యులు.

నిందితులు రోడ్డుపైన ఆగి ఉన్న వాహనాల పై దాడి చేసి అట్టి వాహనాల అద్దాలు పగులగొట్టి అట్టి వాహనదారులనపై పదునైన మారణాయుధాలతో దాడి చేసి, బెదిరించి వారి వద్ద నుండి డబ్బులు, విలువైన వస్తువులను, మొబైల్ ఫోన్లు మరియు రోడ్డుకు దగ్గరలోని ఇళ్ళలో కూడా దొంగతనాలు చేసియున్నారు.

ఇట్టి వ్యక్తులు వారి యొక్క నేరపూరిత చర్యల ద్వారా ప్రజలలో బయాందోళనలు కలుగజేస్తూ సమాజములో శాంతి భద్రతలకు విఘాతం కలుగజేస్తున్నారు. తిరిగి సమాజంలో శాంతి, ప్రశాంతత మరియు సామాజిక సామరస్యం తీసుకరవడానికి వీరిపై PD ఆక్ట్ ప్రయోగించడమైనది. ఇట్టి PD Act వలన నిoదితులు ఒక సంవత్సర కాలం పాటు జైలులో ఉండే అవకాశం ఉన్నది. ఇకపై ఎవరైనా తరచూ నేరాలకు పాల్పడుతూ సమాజములో శాంతి భద్రతలకు విఘాతం కలుగజేస్తే అది పూర్తిగా జైలు జీవితానికి పరిమితమయ్యే అవకాశం కలదు. కావున నేరాలు చేయడం మానుకొని, అలాంటి ఆలోచనలు రాకుండా చూసుకొంటూ మంచి సమాజ జీవితం గడపగలరు అని జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర,ఐపీఎస్ తెలియజేయడం జరిగింది.

Join WhatsApp

Join Now