Site icon PRASHNA AYUDHAM

కొత్తపల్లి ఆశ్రమ పాఠశాల హెచ్ఎం డీడీలను తక్షణమే సస్పెండ్ చేయాలనీ పి డి ఎస్ యు డిమాండ్

IMG 20240811 WA2442

భద్రాచలం డివిజన్ పరిధిలో కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 8 వతరగతి చదువుతున్న విద్యార్థి మరణానికి కారణమైన పాఠశాల హెచ్ఎం తో పాటు సరైన పరిశీలన చేయ లేనటువంటి జిల్లా అధికారిని

డిడి లను తక్షణమే సస్పెండ్ చేయాలని పి డి ఎస్ యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇర్ప రాజేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలుగురు విద్యార్థులు ఎటువంటి సమాచారం లేకుండా ఆశ్రమ పాఠశాల నుండి బయటకు ఎలా వచ్చారని వారు ప్రశ్నించారు. విద్యార్థులు బయటికి వెళ్లిన కొన్ని గంటలపాటు గుర్తించకుండా, పరిశీలన చేయకుండా నిర్లక్ష్యంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉండడం మూలంగానే ఇలాంటి దుర్ఘటన జరిగి విద్యార్థి మరణానికి కారణం అయిందని వారు అన్నారు. ఇందులో ప్రధానంగా ప్రభుత్వం సరియైన స్టాఫ్ ను ఉపయోగించకపోవడం వల్లన ఈ రోజు వరకు విద్యార్దులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థుల రక్షణ కోసం, విద్యార్థుల యోగక్షేమాలు కాపాడుతారని లక్షల రూపాయలు ప్రభుత్వం జీతభత్యాలు చెల్లిస్తుంటే పాఠశాల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రధానోపాధ్యాయులు మాత్రం బాధ్యతారాహిత్యంతో ఉంటూ విద్యార్థులు ఎటు పోతున్నారో కనీసం పరిశీలన చేయకుండా ఉండడంతో గిరిజన ఆశ్రమాలలో అనేక దుర్ఘటనలు జరుగుతున్నాయని దీనితో గిరిజన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మరణించిన కొత్తపల్లి పాఠశాల విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని ఈర్ప రాజేష్ డిమాండ్ చేశారు. ప్రధానోపాధ్యాయులు, వార్డెన్ లు ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని దీని మూలంగా గిరిజన విద్యార్థులపై తీవ్రమైన ప్రభావం పడుతుందని వారు అన్నారు. తక్షణమే ఐటీడీఏ పీవో చొరవ తీసుకొని విద్యార్థి మరణానికి కారణమైన హెచ్ఎం,డిడిలను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థి ఉద్యమాలు ఉదృతం చేస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version