పిడియస్ యూ రాష్ట్ర సభలను జయప్రదం చేయాలి

పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్షులు పెద్దింటి రామకృష్ణ

అరుణోదయ కళాకారుల ప్రదర్శనలు

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్

ఫిబ్రవరి 4,5 తేదీలలో భద్రాచలం పట్టణంలో జరిగే పి డి యస్ యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయాలని భద్రాచలం పట్టణంలోని బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు కళ ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా PDSU రాష్ట్ర అధ్యక్షులు పెద్దింటి రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజికించుకునేందుకు ప్రతిపక్షంలో ఉండి విద్యార్థుల తరపున గొంతు విప్పిన రేవంత్ రెడ్డి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగ బలోపేతానికి ఏమాత్రం కృషి చేయడం లేదని అన్నారు. రాష్ట్రంలోని మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థులు గుర్తించాలని అన్నారు ఎందుకంటే రాష్ట్రంలో గురుకులాలలో వరుసగా ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే అత్యున్నత న్యాయస్థానమే మందలించే స్థితికి మన విద్యా వ్యవస్థ దిగజారిపోయిన స్థితిని ముఖ్యమంత్రి గారు గుర్తించాలన్నారు. సంవత్సరాల తరబడి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ 7500 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సంవత్సరం గడిచిన నేటికీ చెల్లించకపోవడం వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు పెను బారంగా మారిందని వారు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలలో, విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్,టీచింగ్,నాన్ టీచింగ్ పోస్ట్లు భర్తీ చేయడం వదిలేశారని విశ్వవిద్యాలయాలలో కనీసం సౌకర్యాలు లేకుండా నిర్లక్ష్యం వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు.
రాష్ట్రంలో దేశంలో అందరికి సమానమైన,నాణ్యమైన ఉచిత విద్య సాధించడానికి పోరాడాలని అన్నారు.ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం ఉద్యోగ, ఉపాధి అవకాశాల సాధనకై పి డి యస్ యూ రాజీ లేని పోరాటాల నిర్వహిస్తున్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నూతన ఒరవిడితో ముందుకు సాగనున్నామని అన్నారు. ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఈనెల 4,5 తేదీలలో భద్రాచలంలో జరిగే పి డి యస్ యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్లో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ, ప్రణాళిక రూపొందించుకొని విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతుందని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో సంస్కరణల పేరుతో తీసుకొస్తున్న ముసాయిదా ఫెడరల్ స్ఫూర్తి కి అత్యంత ప్రమాదకరమని అన్నారు. యూనివర్సిటీల వీసీల నియామకం కూడా కేంద్ర ప్రభుత్వమే చేపడుతూ ఉండటం రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానం పేరుతో తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని అందుకు ఐక్య పోరాటాలు అవసరమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎలుకం వెంకటేష్ స్వయం రాము నూప వాసం బుచ్చిరాజు మడకం వీరస్వామి మిరప జయమ్మ అప్క లాలమ్మ తదితరులు పాల్గొన్నారు.
అభివందనాలతో
భద్రాచలం డివిజన్ కమిటీ
మునిగేలా శివ ప్రశాంత్.

Join WhatsApp

Join Now

Leave a Comment